పాత షో… పాత పగ… కొత్త కుట్ర… నమ్మేలా ఉందా..?

ఇటీవల ఓ షోలో శ్రీముఖి చేసిన కొన్ని కామెంట్స్ బ్రాహ్మణులను కించ పరిచిచేలా ఉన్నాయి అంటూ… నల్లకుంటకు శర్మ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆ షో 2018 లో జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయిన ‘జూ లక టక’ అనే షోలోవి అని తెలుస్తుంది. ఈ షో ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఎటువంటి ఫుటేజ్ లేక.. తిరిగి పాత షోలను టెలికాస్ట్ చేస్తున్నారు ఛానల్ వారు. అందులో భాగంగానే ఈ షోని పునః ప్రసారం చేస్తున్నారు.

అయితే ఇప్పుడే ఈ షోను మంది చూస్తున్నారనుకుంట. అలా ఈమె పై కేసు పెట్టాడు శర్మ అనే వ్యక్తి. అయితే రెండేళ్ళ క్రితం వచ్చిన షో పై ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి.. అని జెమినీ టీవీ వారు కూడా నోటీసు రిలీజ్ చేసారు. ప్రస్తుతం కేసు క్లోజ్ అయి పోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసు వెనుక ‘బిగ్ బాస్’ కుట్ర ఉందని కొందరు డిస్కస్ చేసుకుంటున్నారు. గతేడాది… శ్రీముఖి ‘బిగ్ బాస్3’ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆమె ఎనర్జీతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.

చివరికి ఈమెనే విన్నర్ అవుతుంది అనుకుంటే.. అలా జరగలేదు. పైగా విన్నర్ మరియు సింగర్ అయిన రాహుల్ తో ఈమె గొడవ పెట్టుకోవడం కూడా అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.రాహుల్ , శ్రీముఖి ఫ్యాన్స్ మధ్య కూడా అప్పుడు చాలా గొడవలు జరిగాయి. అవి మనసులో పెట్టుకుని ఇప్పుడు రాహుల్ ఫ్యాన్స్ శ్రీముఖి పై కేసు పెట్టేలా చేసారు అని టాక్ నడుస్తుంది. అయితే ఇవి పులిహోర వార్తలే అనే వారు కూడా లేకపోలేదు.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus