Actress Rekha: ఆ స్టార్ హీరో వల్ల అవమానాలు పాలైన సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖ..!

అందానికే అందం ఆమె… ఆ ముగ్ధమోహన సౌందర్యానికి ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి స్టార్ డమ్ సంపాదించిన అతి కొద్దిమంది నటీమణుల్లో రేఖ ఒకరు. 70లకు చేరువ అవుతున్నా నేటికీ తరగని అందంతో నేటితరాన్ని కూడా ఆకట్టుకుంటున్నారామె. నాటి నుంచి నేటి వరకూ రేఖ అంటే కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్. అది తండ్రి శివాజీ గణేశన్‌తో వివాదమైనా.. బిగ్‌బీతో ప్రేమాయణమైనా రేఖ తీరే విలక్షణం. మనసులో వున్నది వున్నట్లు ముఖంపై కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. నటిగా ఎంత ఎత్తుకు ఎదిగిందో జీవితంలో అంతే స్థాయిలో ఎత్తుపల్లాలను చూశారు రేఖ.

సినీ జీవితం గురించి పక్కనబెడితే.. రేఖ వ్యక్తిగత జీవితం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మలుపుల మయం. ముఖ్యంగా వైవాహిక జీవితం రేఖకు మనశ్శాంతిని దూరం చేసింది. అమితాబ్‌, పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌లతో ఆమె వివాహం పెళ్లి పీటల వరకు వచ్చిందంటారు విశ్లేషకులు. అయితే అలనాటి హీరో వినోద్ మెహ్రాని రేఖ ప్రేమించిన విషయం అప్పట్లో బీటౌన్‌లో వైరల్ గా మారింది. వినోద్ కుటుంబసభ్యులు పెళ్లికి నో చెప్పడంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.భార్య రేఖను తీసుకుని ఇంటికి వెళ్లిన వినోద్‌కు ఆమె తల్లి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

ఇంటి దగ్గర తన కొడుకు పక్కన రేఖ కనిపించే సరికి కోపం పట్టలేకపోయిన వినోద్ తల్లి ఆమెను చెప్పు తీసి కొట్టబోయిందట. ఈ అవమానంతో ఏడ్చుకుంటూ తిరిగి తన ఇంటికి వచ్చిన రేఖ .. ఆ తర్వాత కొన్నాళ్లకే వినోద్ నుంచి విడాకులు తీసుకున్నారు. అన్ని మరిచిపోయి మళ్లీ జీవితంలో తోడు కోసం వ్యాపారవేత్త ముఖేశ్ అగర్వాల్‌ను పెళ్లాడారు రేఖ. అయితే ఏడు నెలలు తిరగకుండానే ముఖేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో పెళ్లి అనేది తనకు అచ్చిరాదని అర్ధం చేసుకున్న రేఖ.. నాటి నుంచి ఒంటరిగానే వుంటున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus