Mahesh Babu, Major: మేజర్ అక్కడ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా?

స్టార్ హీరోగా మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు మేజర్ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో సక్సెస్ సాధించిన స్థాయిలో ఇతర భాషల్లో సక్సెస్ సాధించలేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

అయితే మహేష్ ప్లాన్ చేయకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాలీవుడ్ లో ఈ సినిమాకు భారీస్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ అక్కడ మరో విధంగా ఉండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మహేష్ తెలుగులో ఈ సినిమాకు ప్రమోషన్స్ ను నిర్వహించిన స్థాయిలో కొంతమేర బాలీవుడ్ పై దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా సంచలన విజయం సాధించి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. క్వాలిటీ కోసమే ఈ సినిమా షూటింగ్ ను ఆలస్యం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ ను ఈ సినిమా మెప్పించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అతడు, ఖలేజా మహేష్ అభిమానులకు నచ్చినా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవలేదు.

అయితే నిర్మాతగా మహేష్ కు ఈ సినిమాతో భారీగా లాభాలు మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బ్రాండ్ వల్ల బయ్యర్లు మేజర్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. మేజర్ ఇప్పటికే దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి బయ్యర్లకు సైతం లాభాలను అందించింది. విక్రమ్ సినిమా నుంచి పోటీ ఎదురుకాకుండా ఉండి ఉంటే మేజర్ లాభాలు మరింత పెరిగి ఉండేవి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus