బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో రోబో టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఈ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగినపుడు రోబో పార్ట్స్ వస్తాయని, వాటిని కలక్ట్ చేసి కంపెనీ వాళ్లకి అమ్మి బిట్ క్వాయిన్స్ తీస్కోవాలని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బిందు, అరియానా, అషూ కంపెనీ హోల్డర్స్ గా ఉన్నారు. మిగతా వాళ్లు రోబో పార్ట్స్ ని కలక్ట్ చేస్తూ డీలర్స్ గా మారారు.
ఇక్కడే సంచాలక్ గా మహేష్ విట్టాని ఉంచాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఎవరికి వారు డీల్స్ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా అషూరెడ్డి క్వాయిన్స్ ఇస్తూ డీల్స్ మాట్లాడింది. నటరాజ్ మాస్టర్ ని తన బొమ్మలని ప్రొటక్ట్ చేసే విధంగా డీల్ సెట్ చేసింది. అలాగే, మిత్రాతో కూడా డీల్ సెట్ చేసుకుంది. ఇక అరియానాతో బొమ్మలని కాపాడుకునేందుకు మనం ట్రై చేయాలని, లాస్ట్ లో ఒకవేళ నాకు బొమ్మలన్నీ రెడీ అయిపోతే క్వాయిన్స్ నీకు ఇచ్చేస్తా అని, దాని ద్వారా నువ్వు నీ బొమ్మలని రెడీ చేసుకోమని డీల్ సెట్ చేసింది.
డా అడిగింది. కానీ, శివ ముందుగానే బిందుతో డీల్ మాట్లాడుకున్నాడు. తన క్వాయిన్స్ అన్నీ లాస్ట్ లో వస్తాయని వేరేవాళ్లకి అమ్మి క్వాయిన్స్ కలక్ట్ చేస్తానని చెప్పాడు. ఈ టాస్క్ లో శివ ఎక్కువ బొమ్మలని కలక్ట్ చేశారు. స్పేర్ పార్ట్స్ లాగా వస్తున్న వాటిని దాచుకున్నాడు. దీన్ని బట్టీ లాస్ట్ లో శివ దగ్గర ఎక్కువ పార్స్ట్ వచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ముమైత్ ఖాన్ కూడా అరియానాతో కలిసి డీల్ సెట్ చేసింది. వాళ్లిద్దరూ కలసి గేమ్ ఆడుతున్నట్లుగా మిగతా హౌస్ మేట్స్ కి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ టాస్క్ చూస్తుంటే ఫిజికల్ గా గట్టిగానే పడేలాగా కనిపిస్తోంది. సీజన్ 4లో కూడా ఇలాగే రోబో టాస్క్ అనేది గేమ్ మొత్తాన్ని మార్చేసింది. ఇప్పుడు అఖిల్ కి ఈ టాస్క్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. సెంటిమెంట్ గా చూసుకున్నా కూడా అఖిల్ కి కలిసిరాని టాస్క్ ఇది. లాస్ట్ టైమ్ అరియానా, హారిక, అభిజీత్, అవినాష్ ఇలా అందరూ టాస్క్ లో తమ టాలెంట్ చూపించి అఖిల్ అండ్ టీమ్ ని ఓడించారు. ఇప్పుడు అఖిల్ ఈ రోబో టాస్క్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరం.