ఈ రోజుల్లో ఓ సినిమాకి థియేట్రికల్ సక్సెస్ ఎలా దక్కుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రమోషన్లు విపరీతంగా చేసినంత మాత్రాన సినిమా సక్సెస్ అవుతుంది అనుకోవడం తప్పు. ప్రమోషనల్ కంటెంట్ జనాలను అట్రాక్ట్ చెయ్యాలి.. అప్పుడే హైప్ క్రియేట్ అవుతుంది. థియేటర్లకు జనాలు వస్తారు. లేదంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ మెథడ్ ఫాలో అయితే కంటెంట్ సో సో గా ఉన్నాసరే సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
అయితే ఈ కేటగిరిలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న సినిమా ‘మేమ్ ఫేమస్’. ‘రైటర్ పద్మభూషణ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘లహరి ఫిల్మ్స్’, ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ సంస్థలు నిర్మించిన సినిమా ఇది. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా కూడా.! రిలీజ్ కు ముందు ఈ చిత్రాన్ని ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు. అందుకే ఈ సినిమా అక్కడ డీసెంట్ సక్సెస్ అందుకుంది. బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు.
అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. అయితే ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డిజిటల్ రిలీజ్ అవ్వగా.. ఇక్కడ మాత్రం ఫైజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమా చూసిన వాళ్ళు ‘ఇదేం సినిమా?’ ‘ఇదెలా సక్సెస్ అయ్యింది?’ ‘ఇంత చీప్ క్వాలిటీనా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైతేనేం ఈ సినిమా అయితే థియేట్రికల్ గా సక్సెస్ అయ్యింది.