Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ డ్రెస్ గురించి వైరల్ అవుతున్న ట్రోల్స్..!

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్, రీల్స్ వంటివి షేర్ చేస్తే.. లైవ్ లో ఫ్యాన్స్, నెటిజన్లతో ముచ్చటించడాన్ని స్టార్స్ ఎంజాయ్ చేస్తుంటారు. వారి కోరికలు, ప్రశంసలు, సందేహాలు తీర్చుకోవడానికి ప్రేక్షకులకు, సెలబ్రిటీలకు మధ్య వారధిలా మారాయి సామాజిక మాధ్యమాలు. ఇక్కడివరకు బాగానే ఉంటుంది కానీ.. కొంతమంది తమ పిచ్చి మాటలు, చిలిపి చేష్టలతో సెలబ్స్ కి చిరాకు తెప్పిస్తుంటారు.

అడగకూడనివి అడగడం, మాట్లాడేటప్పుడు విచక్షణ కోల్పోవడం, సెలబ్స్ పేరు మీద ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చెయ్యడం లాంటివన్నమాట. నటీనటులు ఆన్ స్క్రీన్ లో లానే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఉండరు కదా.. సో, మేకప్ లేని పిక్స్ షేర్ చేసినా కానీ వాళ్ల లుక్స్ గురించి ట్రోల్స్ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ మీద పడ్డారు మీమ్స్ రాయుళ్లు.. నార్త్ వాళ్లు ధంతేరస్, దివాళీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే.

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ స్టైలిష్ట్ మనీష్ మల్హోత్రా గ్రాండ్ దివాళీ బాష్ అరైంజ్ చేశారు. ఈ పార్టీకి పలువురు స్టార్ట్ అటెండ్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్యర్య రాయ్ బచ్చన్ కూడా వచ్చారు. ఐష్, పింక్ ట్రెడిషనల్ వేర్ లో మరింత బ్యూటిఫుల్ గా కనిపించింది. అభిషేక్ కూడా న్యూలుక్ తో స్టైలిష్ గానే ఉన్నాడు. అయితే ఆయన వేసుకున్న డ్రెస్సే కొంచెం తేడాగా ఉంది అంటూ నెటిజన్లు..

అభిషేక్ లుక్ ని ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు.. డార్క్ పింక్ షేర్వాణీలో ఉన్న అభిషేక్ ని చూసి.. ‘‘ఏంటి అభిషేక్, కంగారులో నీ భార్య డ్రెస్ వేసుకొచ్చేశావా?.. ఐశ్వర్య లాంటి భార్య పక్కనుంటే.. నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. ఎంత స్టైలిష్ గా కనిపించాలని ట్రై చేసినా నిన్నెవరూ చూడరు’’.. అంటూ అభిషేక్ ని ఆటపట్టిస్తున్నారు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus