Adipurush Movie: ఆది పురుష్ అప్డేట్ ఇవ్వమంటూ ఓం రౌత్‌ పై భారీ ట్రోల్స్!

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ అనంతరం తను నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె ,ఆది పురుష్ వంటిచిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ప్రభాస్ రాముడిగా, రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇందులో ప్రభాస్ రాముడుగా నటించగా కృతిసనన్ సీత పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదివరకే ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలకు అప్డేట్ విడుదల చేసినప్పటికీ ఆది పురుష్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నెటిజన్లు పెద్దఎత్తున చిత్ర బృందాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓపిక నశించిన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వార్‌ ప్రకటించారు. #WakeUpTeamADIPURUSH అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజనులు ఈ సినిమా అప్డేట్ కోసం సోషల్ మీడియా వేదికగా ‘నీ బాంచన్‌ అయిత, జర ఆదిపురుష్‌ అప్‌డేట్‌ ఇవ్వరాదన్నా… ఓం రౌత్ భయ్యా నిద్ర పోయింది చాలు ఇక ఈ సినిమా అప్డేట్ ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు.

ఈ విధంగా ఈ సినిమా అప్డేట్ కోసం నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తూ పెద్ద ఎత్తున చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్రబృందం స్పందించి ఏమైనా అప్డేట్ విడుదల చేస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus