Suma: యాంకర్ సుమ పై ట్రోలింగ్.. ఎందుకంటే?

సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేరళకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ‘కల్యాణ ప్రాప్తిరస్తు’, ‘పవిత్ర ప్రేమ’, ‘వర్షం’, వంటి సినిమాల్లో నటించింది.కానీ ఈమెకు వెండితెర అంతగా కలిసి రాలేదు.. కానీ బుల్లితెర పై మాత్రం బాగా క్లిక్ అయ్యింది. ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమను మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేకపోయారు.

ఈ విషయాన్ని అందరు యాంకర్లు ఒప్పుకుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తుంది సుమ. సినిమా వేడుకలకు కూడా ఈమె యాంకరింగ్ చేస్తేనే అందం.సుమ యాంకర్ గా వ్యవహరించింది అంటే ఆ సినిమా పై కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో ఉంది. ఇదిలా ఉండగా.. సుమ పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతుంటాయి.

తన భర్త రాజీవ్ తో (Suma) సుమకు గొడవలు ఉన్నాయని…, అందువల్ల సెపరేట్ గా ఉంటుందని, ఇద్దరూ విడాకులు తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదు అని ఆమె కొట్టిపడేసింది. సమయం దొరికినప్పుడల్లా.. తన భర్తతో కనిపిస్తూ అలాంటి ప్రచారాలు జరగకుండా చూసుకుంటుంది. ఇదిలా ఉంటే… తాజాగా ఆమె కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్ళు..

ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా నటించాడు.ఇవి మంచివి కాదని, డెలివరీ చేసే లోపే పాడైపోతున్నాయని, ప్యాకింగ్ కూడా సరిగ్గా ఉండటం లేదని, డబ్బు కోసం ఇలాంటివి ప్రమోట్ చేయొద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుమ కరోనా టైం నుండి ఆ సంస్థ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus