Bigg Boss Telugu 5: ప్రియాంక శ్రీరామ్ విషయంలో అలా చేస్తుంటే? బిగ్ బాస్ టీమ్ నిద్రపోతోందా..?

బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్ లెవల్ కంప్లీట్ చేస్కున్న హౌస్ మేట్స్ సెకండ్ లెవల్ కి వెళ్లారు. ఇక్కడే షణ్ముక్ ని ఇంకా సన్నీని స్వాప్ చేశాడు బిగ్ బాస్. వీళ్లిద్దరూ పక్కనున్న వాళ్లకి ఫేవర్ గా గేమ్ ఆడుతున్నారు అనుకున్నాడో ఏమో కానీ ప్లేస్ లు మార్చేశాడు. దీంతో సిరి సన్నీబాల్స్ ని గుంజుకోవడానికి ట్రై చేసింది. సన్నీ బాస్కెట్ ని పారేసింది. దీంతో వీళ్లిద్దరికీ మళ్లీ గొడవ స్టార్ట్ అయ్యింది. నన్ను కావాలనే గేమ్ లో మళ్లీ టార్గెట్ చేస్తూ బ్యాడ్ గా ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు అంటూ సన్నీ కస్సుబుస్సులాడాడు.

ఒక పక్కన తోటి హౌస్ మేట్స్ అందరూ ఐస్ లో నుంచీ కాళ్లు తీయమని చెప్తున్నా కూడా సిరి వినిపించుకోలేదు. శ్రీరామ్, షణ్ముక్ ఇద్దరూ కూడా ఐస్ లో చాలాసేపు కాళ్లని పెట్టుకున్నారు. దీంతో మెడికల్ రూమ్ కి పిలిపించి పరీక్షించాడు బిగ్ బాస్. అంతేకాదు, ప్రియాంక వేడినీళ్లు తీస్కుని పోసుకోబోతుంటే అది ప్రమాదకరం అంటూ వారించాడు. అయితే, గేమ్ ఆడి చాలాసేపు అయ్యిందని, రాత్రి నొప్పితో పడుకోలేకప బాధపడుతున్న శ్రీరామ్ ని చూసి, ప్రియాంక హాట్ వాటర్ తెచ్చి చల్లింది. అంతేకాదు, పెయిన్ బామ్ సైతం రాసింది. దీంతో శ్రీరామ్ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి వచ్చాడు.

వెంటనే మార్నింగ్ మెడికల్ రూమ్ లో శ్రీరామ్ రెండు కాళ్లని పరీక్షించి బ్యాండేజ్ లు వేశారు. మందులు ఇచ్చారు. తను చేసిన పనికి ప్రియాంక శ్రీరామ్ కి వచ్చి సారీ చెప్పింది. కాజల్, మానస్ ఇద్దరూ కూడా అలా ఎలా చేస్తుంది బిగ్ బాస్ చెప్పినా కూడా అంటూ అసహనాన్ని చూపించారు. అయితే, ఇక్కడ బిగ్ బాస్ ప్రియాంక జెండూభామ్ రాయడం, వేడినీళ్లని చల్లడం చూస్తునే ఉన్నప్పుడు మరోసారి ఎనౌన్స్ చేసి ఉండాల్సింది. అలా బిగ్ బాస్ చేయలేదు. దీంతో నెటిజన్స్ అందరూ బిగ్ బాస్ కళ్లు మూసుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు.

ప్రియాంక అలా చేస్తుంటే కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు. బిగ్ బాస్ టీమ్ నిద్రపోతోందా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీరామ్ చంద్ర ఫ్యాన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. రేస్ టు ఫినాలే టాస్క్ అయ్యేటపుడు ఇలాంటివేనా చేసేది అంటూ ఫైర్ అవుతున్నారు.ఇక శ్రీరామ్ కి అలా ఉన్నప్పుడు తను పాడిన పాట గెలుపు తలుపులే తీసే ఆకాశమే అనే పాట రాగానే శ్రీరామ్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. శ్రీరామ్ బాధని చూసి తనవల్లే ఇలా అయ్యిందా అంటూ సన్నీ స్మోక్ రూమ్ లోకి వెళ్లి మరీ బాధపడ్డాడు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus