Bigg Boss Telugu 6: పబ్లిక్ ఓటింగ్ అంటే లెక్కలేదా..? కావాలనే చేశారా..? ఫినాలేలో ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎట్టకేలకి ముగిసింది. అయితే, ఫైనల్ గా రేవంత్ ఇంకా శ్రీహాన్ ఉన్నప్పుడు హోస్ట్ నాగార్జున స్వయంగా హౌస్ లోకి వెళ్లి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో పార్టిసిపెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మొదటి 25లక్షలు ప్రైజ్ మనీలో సూట్ కేస్ లో ఉందని ఇది తీస్కుంటే వెళ్లిపోదామని రేవంత్ ని శ్రీహాన్ ని టెమ్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రైజ్ మనీని ఒక్కసారి 30 లక్షలకు పెంచాడు. అయినా కూడా శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ నో అని చెప్పారు.

నిజానికి అంతకుముందు కీర్తి ఉన్నప్పుడే మాస్ రాజా రవితేజ హౌస్ లోకి సిల్వర్ సూట్ కేస్ తీస్కుని వెళ్లాడు. కానీ, హౌస్ మేట్స్ దాన్ని రిజక్ట్ చేశారు. అప్పుడు 15లక్షల వరకూ ఆఫర్ చేశారు. కానీ, ముగ్గురూ నో చెప్పారు. ముఖ్యంగా రేవంత్ అసలు నాకు వద్దే వద్దని, ట్రోఫీనే కావాలని మొండిగా కూర్చున్నాడు. దీంతో మిగతా వాళ్లు కూడా అదే మాట మీద ఉన్నారు. ఇక నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో వచ్చినపుడు ప్రైజ్ మనీని పెంచుతూ వచ్చాడు. దీంతో ప్రైజ్ మనీ 40 లక్షలు చేశాడు.

అంతేకాదు, మిగతా హౌస్ మేట్స్ ని సలహా అడమని శ్రీహాన్ కి హింట్ ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ లో మెజారిటీ ఇంటిసభ్యులు తీస్కోమని చెప్పారు. గతంలో సీజన్ – 4 లో ఇలాగే అందరూ తీస్కోమని చెప్పినపుడు సూట్ కేస్ తీస్కుని సోహైల్ ఎలాగైతే వచ్చేశాడో, అలాగే సేమ్ టు సేమ్ శ్రీహాన్ కూడా 40 లక్షల ఆఫర్ కి టెమ్ట్ అయిపోయాడు. దీంతో విన్నర్ కి కేవలం 10 లక్షలు మాత్రమే వస్తుందని తెలిసినా రేవంత్ మౌనంగా ఉండిపోయాడు. ఇక ఆఫర్ తీస్కుని స్టేజ్ పైకి ఇధ్దరూ వచ్చిన తర్వాత రేవంత్ ని విన్నర్ గా ప్రకటించాడు కింగ్ నాగార్జున.

ప్రైజ్ మనీ పంపకాలు అన్నీ అయిపోయాక, అందరికీ షాక్ ఇస్తూ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పాడు. టాప్ – 1 , టాప్ – 2 పొజీషన్స్ ఎవరో చెప్పడం నా బాధ్యత అంటూ టాప్ లో కొద్దిగా ఓట్ల తేడాతో శ్రీహాన్ గెలిచాడని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కి ఫీజులు ఎగిరిపోయాయ్. అయితే, ఇది నాగార్జున కావాలనే బిస్కెట్ వేశాడా అని చాలామంది ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. 40 లక్షలు తీస్కుని రన్నరప్ గా నిలిచిన శ్రీహాన్ పబ్లిక్ ఓటింగ్ ప్రకారం మాత్రం విన్నర్ అయ్యాడని చెప్పడంతో మొత్తం అన్ ఫైయిర్ అంటూ ఆడియన్స్ ధ్వజమెత్తుతున్నారు.

పబ్లిక్ ఓటింగ్ అంటే లెక్కలేదా.. ఎందుకు ఇలా అన్ ఫైయిర్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, అన్ అఫీషియల్ పోలింగ్స్ చూసినా, ఎక్కడ ఏ ఫ్లాట్ ఫార్మ్ పైన చూసినా, రేవంత్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ కావాలనే ఇలా చేసిందని, శ్రీహాన్ కి ఫేవర్ గా హోస్ట్ కూడా ఉంటడాన్ని తప్పుబడుతున్నారు. బిగ్ బాస్ షో చూసే వాళ్లకి నాగార్జున ఫైనల్ గా ఇచ్చిన షాక్ వల్ల షో బిస్కెట్ అయిపోయిందని అంటున్నారు. గ్రాండ్ ఫినాలే చాలా గొప్పగా చేసి లాస్ట్ లో ఈ అన్ ఫైయిర్ డెసీషన్ ఏంటని మొత్తుకుంటున్నారు. మొత్తానికి అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus