Devi Sri Prasad: బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు శాటిస్ఫై అయినట్టేనా?

దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు ఆ ఇమేజ్ ను కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) .. దేవీని పక్కనబెట్టడం పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకి దేవీ శ్రీ ప్రసాదే సంగీతం అందించాడు. ‘పుష్ప 2’ (Pushpa2)  చిత్రానికి కూడా దేవినే సంగీత దర్శకుడు.

Devi Sri Prasad

కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే బాధ్యతని ‘పుష్ప 2’ టీం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి అప్పగించింది. అవును రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో సామ్ సి ఎస్(Sam C. S.) , తమన్ (S.S.Thaman),, అజనీష్ లోకనాథ్(B. Ajaneesh Loknath).. వంటి సంగీత దర్శకులతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్. దీనిపై మొదట ఫ్యాన్స్ సైతం మండిపడ్డారు. ‘పుష్ప’ కి (Pushpa)  దేవీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

‘పుష్ప 2’ గ్లింప్స్.. దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే హైలెట్ అయ్యింది. కానీ ‘అతన్ని సినిమా నుండి తప్పించడం ఏంటి?’ అని సోషల్ మీడియాలో అంతా కామెంట్లు చేశారు. కానీ నిన్న ‘కంగువా’ (Kanguva) రిలీజ్ అయ్యింది. దీనికి దేవీ శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఒక పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగిలినవి ఆడియన్స్ కి రుచించలేదు.

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా దారుణంగా ఉందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ‘ఒకటే ట్యూన్ ను రిపీటెడ్ గా కొట్టుకుంటూ పోయాడు దేవి.. అది ఏమాత్రం ఆకర్షించే విధంగా లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, అలాగే యాంటీ ఫ్యాన్స్ కలిసి.. సోషల్ మీడియాలో దేవిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus