Mr Bachchan: ‘ఆడవాళ్లు అంటే అంత చులకనా?’ అంటూ ‘మిస్టర్ బచ్చన్’ డైలాగ్ పై ట్రోలింగ్!

రవితేజ (Ravi Teja)  , దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)  సినిమా.. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మొదటి నుండి దర్శకుడు హరీష్ శంకర్ పై ఏర్పడ్డ నెగిటివిటీ వల్ల.. ‘మిస్టర్ బచ్చన్’ ని దారుణంగా తొక్కేశారు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. సరే సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. జయాపజయాలు అనేవి సర్వసాధారణం. సో ‘మిస్టర్ బచ్చన్’ రిజల్ట్ ని కూడా ప్రేక్షకులు త్వరగానే మర్చిపోయారు.

Mr Bachchan

అయితే నిన్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్(ఓటీటీ) లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన చాలా మంది ప్రేక్షకులు ‘మిస్టర్ బచ్చన్’ ని  (Mr Bachchan) నెట్ ఫ్లిక్స్ లో వీక్షిస్తున్నారు. ఇక్కడ కూడా మౌత్ టాక్ కొంత పర్వాలేదు. కానీ ఓ డైలాగ్ పై మాత్రం నెటిజన్లు ఘోరమైన విమర్శలు చేస్తున్నారు. అదేంటంటే.. ‘ ‘మిస్టర్ బచ్చన్’ స్టార్టింగ్లో ఓ ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో నాగ మహేష్ (Naga Mahesh) , బి.వి.ఎస్.రవి (B. V. S. Ravi) నిలబడి రవితేజ ఫైట్ చేయడాన్ని చూస్తుంటారు.

ఈ క్రమంలో బి.వి.ఎస్ రవి.. ‘మొదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తుంది బావా… అదే ఆడదానిగా పుట్టుంటేనా..?’ అంటూ ఓ హేయమైన ఎక్స్ప్రెషన్ పెడతాడు. నిజంగా ఇది అభ్యంతరకరంగానే అనిపిస్తుంది. ఈ సీన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన కొంతమంది లేడీ నెటిజన్లు.. ‘మహిళలను చులకనగా, కించపరిచే విధంగా ఈ డైలాగ్ ఉంది’ అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు.

దీన్ని బట్టి.. సినిమా థియేటర్లలో ఉండగా కంటే, ఓటీటీలోకి వచ్చినప్పుడు ఎక్కువ ట్రోల్ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) సినిమాలో బొమ్మాళి రవిశంకర్ (P. Ravi Shankar) తో ఇలాంటి ఘోరమైన డైలాగులు పలికించాడు దర్శకుడు హరీష్ శంకర్. హీరోని ఎలివేట్ చేయడానికి అతను ఇలాంటి డైలాగులు పెట్టడం మానేస్తే బెటర్ అనేది అందరి అభిప్రాయం.

సందీప్ పై దృష్టి పెడుతున్న టాలీవుడ్ అగ్ర హీరోలు.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus