ఆమె వల్లే ‘బిగ్ బాస్’ షోని బూతు షో అంటున్నారే..!

  • October 12, 2020 / 07:17 PM IST

హిందీలో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో.. సౌత్ లోని అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ షో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పటికే 3 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ సీజన్ కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే వివాదాల విషయంలో కూడా ‘బిగ్ బాస్’ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ షో నిలిపివెయ్యాలంటూ గతంలో ఎంతో మంది కోర్టుకెక్కారు.

అయితే అవేమీ ఈ షోని ఆపలేకపోయాయి. సరే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. ‘బిగ్ బాస్4’ పై ఇప్పుడు మళ్ళీ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అందుకు కారణం హౌస్ లో ఉన్న మోనాల్ గజ్జర్ అనే కంటెస్టెంట్. మ్యాటర్ ఏమిటంటే.. గత ఆదివారం షోలో హోస్ట్ నాగార్జున హౌస్మేట్స్ తో ముచ్చటిస్తున్న తరుణంలో మోనాల్ వస్త్రధారణ చూసినవారంతా షాక్ కు గురయ్యారు. ‘ఫ్యామిలీ ఆడియెన్స్ వీక్షించే ఈ షోలో ఇలాంటి డ్రెస్సింగ్ ఏంటని’ నెటిజన్లు మండిపడుతున్నారు.

అంతేకాదు మోనాల్ కావాలనే ఇలాంటి దుస్తులు ధరించి కెమెరాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిందని.. మొదట్లో అయినదానికి, కానిదానికి ఏడుస్తూ ఎక్కువ ఫుటేజ్లో పడేలా జాగ్రత్త పడిందని.. కొందరు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు అభిజీత్, అఖిల్ వంటి కంటెస్టెంట్లతో చనువుగా ఉంటూ వారి మధ్య గొడవలు ఏర్పడేలా చేసిందని కూడా వారి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

1

2

3

4

5

 

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus