Mythri Movie Makers: టాప్ ప్రొడక్షన్ హౌస్ పై భారీ ట్రోల్స్!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ఫ్యాన్స్ కి, స్టార్స్ కి మధ్య దూరం బాగా తగ్గింది. ఏ అనౌన్స్మెంట్ అయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి చేరవేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరోల సినిమాలు మేకింగ్ దశలో ఉన్నప్పుడు టైమ్ కి అప్డేట్స్ ఇవ్వకపోతే గనుక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సమయానుకూలంగా ఇవ్వలేదని యూవీ క్రియేషన్స్ ని టార్గెట్ చేస్తూ అభిమానులు నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేశారు.

ఒకానొక దశలో యూవీ ఆఫీస్ కు వెళ్లి మరీ గొడవ చేశారు. ఈ మధ్య అజిత్ అభిమానులు కూడా ‘వాలిమై’ అప్డేట్ కోసం ఆ చిత్ర పీఆర్ఓ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇలానే చేస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. కానీ కొన్ని నెలలుగా సినిమాకి సంబంధించి సరైన అప్డేట్స్ బయటకి రావడం లేదు. సినిమా మొదలైనప్పుడు ఫస్ట్ లుక్ వదిలారు. ఆ తరువాత రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు.

అవి తప్ప ‘పుష్ప’ టీమ్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఆగస్టు 13న సినిమా రిలీజ్ అంటే ఇప్పటికి కనీసం టీజర్ అయినా.. విడుదల చేయాలి కానీ అలా జరగలేదు. దీంతో ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. #WakeUpMythriMovieMakers అనే హ్యాష్ ట్యాగ్ ని ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ ని మైత్రి సంస్థ సరదాగానే తీసుకుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ని తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ నవ్వుల ఎమోజీలు పెట్టారు. త్వరలోనే బన్నీ పుట్టినరోజు ఉంది కాబట్టి ఆరోజు టీజర్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus