Nagarjuna: నాగార్జున యాంకరింగ్ పై కామెంట్స్..! ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున వచ్చే ఎపిసోడ్స్ అన్నీ టీఆర్పీ రేటింగ్స్ లో దుమ్మురేపుతుంటాయి. వారం అంతా ఎపిసోడ్ చూడని వాళ్లు కూడా నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతుంటే మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అందులోనూ గేమ్ సరిగ్గా ఆడనివాళ్లని తిడుతుంటే ఎంజాయ్ చేస్తారు. అయితే, శనివారం నాగార్జున చేసిన పంచాయితీ తీర్పు పై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే., శ్రీహాన్ – ఇనయ ఇద్దరిమద్యలో గొడవ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో శ్రీహాన్ కూడా పిరమిడ్స్ ని టచ్ చేశాడని సంచాలక్ అయిన రేవంత్ కి ఇనయ కంప్లైట్ ఇచ్చింది.

దీంతో పక్కనుంచీ శ్రీహాన్ ప్రతి పిట్టి మాట్లాడే మాటలు పట్టించుకోవద్దంటూ కామెంట్ చేశాడు. దీంతో ఇనయ రెచ్చిపోయింది. పిట్ట అని ఎట్లా అంటావ్ అంటూ వాదనకి దిగింది. దీంతో శనివారం పంచాయితీ చేసిన నాగార్జున శ్రీహాన్ కి క్లాస్ పీకాడు. నిన్ను వాడు అంటే పొడుచుకుని వచ్చినపుడు తనని పిట్ట అంటే అంతే ఫీల్ అవుతుంది కదా అంటూ చెప్పాడు. అంతేకాదు, ఇద్దరి మద్యలో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏదైనా నడుస్తుంది. అది లేనపుడు ఏది మాట్లాడినా నడవదు అంటూ తీర్పు చెప్పాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.

కానీ, పిట్ట అంటే బాడీ షేమింగ్ కాదని, అదేం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదన్నట్లుగా పాటలు ప్లే చేశారు. పాటలు ప్లే చేసి ఈ పాటలో ఏదైనా బాడీషేమింగ్ ఉందా అంటూ హౌస్ మేట్స్ ని ప్రశ్నించారు. ఇక్కడ సినిమా పాటలు ఏవిధంగా కన్సిడర్ చేస్తారు. బయట ఎవరైనా అమ్మాయిని పిట్టా అని కామెంట్ చేస్తే తప్పుకాదా అంటూ నాగార్జునని నిలదీస్తున్నారు నెటిజన్స్. నాగార్జున హోస్టింగ్ చేసేపుడు క్లియర్ గా ఉండాలని, అంతేకాదు ఇష్టమొచ్చినట్లు తీర్పు ఇవ్వొద్దని చెప్తున్నారు. తప్పుని తప్పని ఖండించాలని అంటున్నారు.

అంతేకాదు, గీతు విషయంలో కూడా నాగార్జున క్లాస్ పీకట్లేదని, ఆమె బిగ్ బాస్ షోలో పనివాళ్లని కామెంట్ చేసినా లైట్ తీస్కుంటున్నారని కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. పిట్ట అనేది తప్పు కాదని , బాడీ షేమింగ్ కాదని ఎలా అంటారని నాగార్జునని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయినా సినిమాలో లావణ్యత్రిపాఠిని కామెంట్ చేసిన క్లిప్స్ కూడా వేస్తున్నారు. పిట్ట పిటపిట లాడిపోతోంది అనే డైలాగ్ ని షేర్ చేస్తూ నిలదీస్తున్నారు. మరి దీనిపైన నాగార్జున రానున్న ఎపిసోడ్స్ లో ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus