పూజా హెగ్డే ఓ తమిళ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ, ఆమె తెలుగులో మొదట చేసిన మూవీ ‘ఒక లైలా కోసం’ అటు తర్వాత ‘ముకుందా’ మూవీలో కూడా నటించింది. అయితే ఈమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ ‘డిజె'(దువ్వాడ జగన్నాథం) అన్న సంగతి తెలిసిందే. అటు తర్వాత ఈమెకు ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘గద్దలకొండ గణేష్’ ‘అల వైకుంఠపురములో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి హిట్లు పడ్డాయి.
కానీ ఆమె నుండీ ఇటీవల వచ్చిన ‘రాధే శ్యామ్’ ‘బీస్ట్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఈమె క్రేజ్ అయితే తగ్గలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా 2021 కి గాను సైమా నిర్వహించిన అవార్డు వేడుకల్లో పూజా హెగ్డేకి రెండు అవార్డులు లభించాయి. ‘బెస్ట్ హీరోయిన్’ గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి గాను ఒకటి, మరొకటి సైమా యూత్ ఐకాన్ అవార్డు మరొకటి కావడం గమనార్హం.
దీంతో ఆమె పై ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం. ఎందుకంటే 2021 కి గాను బెస్ట్ హీరోయిన్(యాక్ట్రెస్) కేటగిరిలో సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాలతో సాయి పల్లవి కూడా నామినేట్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లోనూ సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో పూజా హెగ్డే సాధారణ యువతిగానే కనిపిస్తుంది. గుర్తుంచుకునే పాత్ర కాదు, భీభత్సమైన పెర్ఫార్మన్స్ కూడా ఆమె ఇచ్చింది లేదు.
దీంతో సాయి పల్లవికి అవార్డు ఇవ్వకుండా పూజకి ఎలా అవార్డు ఇచ్చారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘డబ్బులు ఇచ్చి ఆమె అవార్డు కొనుక్కుంది’ అంటూ పూజా హెగ్డే పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నెటిజన్ల ఆర్గ్యుమెంట్ కరెక్టే అయ్యుండొచ్చు కానీ, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లు అవార్డు ఫంక్షన్లకు వస్తే వేడుకకు బాగా పబ్లిసిటీ జరుగుతుందని.. సైమా వంటి సంస్థలు భావించి వాళ్లకు అవార్డులు ఇస్తుంటాయి. ఈ విషయాన్ని పోయి పూజా హెగ్డేని ట్రోల్ చేయడం సరికాదు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.