రజినీ వల్ల మన హీరోల పై సెటైర్లు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రజినీకాంత్ కు 167 వ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయిపొయింది. సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే రజినీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా శివ డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేస్తారట. ఈ చిత్రం రజినీకి 168 వ చిత్రం కావడం విశేషం. ఇప్పుడు తన 169వ చిత్రానికి సంబందించిన డిస్కషన్లు కూడా జరిగిపోతున్నాయట. డైరెక్టర్ ను కూడా దాదాపు ఖరారు చేసేసినట్టు తెలుస్తుంది.

కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం విభిన్న చిత్రాలని తెరకెక్కించే గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో రజినీ 169 వ చిత్రం ఉండొచ్చని తెలుస్తుంది. గౌతమ్ మీనన్ ప్రతీ హీరోని చాలా డిఫరెంట్ గా చూపిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ప్రతీ స్టార్ హీరోకి ఈయనతో ఓ సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు. క్లాస్ సినిమాతోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఈయన స్పెషలిస్ట్. ఇక ఈ దర్శకుడికి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య రజినీ కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే గౌతమ్ మీనన్ ను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఇదిలా ఉంటే వరుసగా ఓ స్టార్ హీరో ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం.. అదీ పెద్ద వయసులో అంటే ఎంతో ఆశ్చర్యం కలిగించక మానదు. అందుకే మన హీరోలు రజినీని చూసి నేర్చుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు అభిమానులు. సంవత్సరంలో ఒక సినిమా చేయడానికే మనోళ్ళు కిందా మీదా పడుతుంటే.. 68 ఏళ్ళ వయసున్న రజినీ మాత్రం అలిసిపోకుండా సినిమాలు చేస్తుంటే.. అందరి స్టార్ హీరోల అభిమానులకి అలాంటి ఫ్రస్ట్రేషనే ఉంటుంది మరి.!

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus