లాక్ డౌన్ కారణంగా ఓటిటి సంస్థలకు బాగా డిమాండ్ పెరిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడంతా ‘అమెజాన్’ ‘నెట్ ఫ్లిక్స్’ ‘హాట్ స్టార్’ ‘ఆహా’ వంటి ఓటిటి సంస్థల హవానే నడుస్తుంది. గత 3నెలలుగా థియేటర్లు మూత పడటంతో వీటికి సబ్ స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారని చెప్పొచ్చు. విడుదలకు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలు వీటి దయవల్ల రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. సినిమాలను థియేటర్లో రిలీజ్ చెయ్యాలి అంటే కచ్చితంగా సెన్సార్ చేయించాల్సిందే.
అందులో బూతులు ఉంటే బీప్ లు పెడతారు, అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటే వాటిని కట్ చేస్తారు. వివాదాలు రేపే సన్నివేశాలు ఉన్నాయని తెలిస్తే వాటిని కూడా డిలీట్ చేసేస్తుంటారు సెన్సారు సభ్యులు. కానీ వెబ్ సిరీస్ లకు మాత్రం అలాంటివేమీ అవసరం లేదు. బూతులు ఉంటున్నాయి, శృంగా*పు సన్నివేశాలు ఉంటున్నాయి. ఇక విషయం ఏమిటంటే.. తాజాగా ఓ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది. ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు.. స్వరభాస్కర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ‘రాస్ భరి’.
ఈ వెబ్ సిరీస్ లో ఆమె.. సంస్కృతి, సంప్రదాయాల్ని మంటగలిపే వేశ్య తరహా పాత్రలో నటించింది. తన చుట్టు పక్కన ఉన్న పురుషులను ఆకర్షించడానికి ఆమె ప్రయత్నిస్తుండడం వంటి సన్నివేశాలు ఈ వెబ్ సిరీస్‌లో ఉన్నాయి. దీంతో ‘అసభ్యకరమైన కంటెంట్‌తో రూపొందించే ఇలాంటి వెబ్ సిరీస్‌లను వెంటనే బ్యాన్ చెయ్యాలి’ అంటూ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు.