Upasana: వివాదాస్పదమైన ఉపాసన పోస్ట్..ఫైర్ అవుతున్న నెటిజన్లు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చరణ్ కు సంబంధించిన ఫోటోలతో పాటు హెల్త్ టిప్స్ అలాగే సామజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తుంటుంది. ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి ఎతిక్స్, మోరల్స్ కలిగిన వ్యక్తి అంటూ నెటిజన్లు ఈమెను పొగుడుతూ ఉంటారు. కొంతమంది ఈమెను విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఉపాసన ఊహించని విధంగా ఓ వివాదంలో చిక్కుకుంది.ఇటీవల ఉపాసన చేసిన కొన్ని కామెంట్లు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అంటే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా … ‘గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు’ అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ‘ఓ పెద్ద గుడి గోపురం మీద దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలబడి ఉన్నట్టు’ ఓ ఫోటోని కూడా జత చేసింది.

ఇది ఎడిటింగ్ ఫోటోనే..! గుడిగోపురం పై ఉన్న ప్రజల్లో “నేను, నా భర్త రాంచరణ్ కూడా ఉన్నాము,మేము ఎక్కడ ఉన్నామో కొనుక్కోండి’ అంటూ ఉపాసన పేర్కొంది.’ఈ ఫోటోని ఎడిట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్తే అభినందించాలని ఉంది’ అంటూ కూడా ఆమె రాసుకొచ్చింది. అంతే ‘దేవుడు గోపురాన్ని అడ్డు పెట్టుకుని మరీ మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలా’ అంటూ కొంతమంది విరుచుకుపడుతున్నారు.మరికొంతమంది ఈ ఫోటోని ఎడిట్ చేసిన వ్యక్తి కంటే గోపురాన్ని నిర్మించిన కళాకారుల్ని మెచ్చుకోవాలి, అభినందించాలి’ అంటూ కొందరు ఆమెకు సలహాలు ఇస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus