Yadamma Raju: యాదమ్మ రాజు నిశ్చితార్థం.. గ్యాప్ లేకుండా ట్రోలింగ్.. మేటర్ ఏంటి..?

యాదమ్మ రాజు.. ఇతను అందరికీ సుపరిచితమే. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘పటాస్’ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత జీ తెలుగు వారు నిర్వహించిన కామెడీ షోలో కూడా నటించాడు. పంచ్ డైలాగులను అమాయకమైన రీతిలో చెప్పి నవ్వించడం ఇతని స్టైల్. యాదమ్మ రాజు పలు సినిమాల్లో కూడా నటించాడు. ఇదిలా ఉండగా.. ఇతను చాలా కాలంగా స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. తాజాగా వారి నిశ్చితార్థం జరిగిన సంగతి కూడా తెలిసిందే. పెద్దలను ఒప్పించి త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.యాదమ్మ రాజు త్వరలోనే ఒక ఇంటి వాడు కాబోతున్నందుకు అందరూ అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అతని ఫ్రెండ్స్ అందరూ అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

కాకపోతే కొంతమంది పనిగట్టుకుని యాదమ్మ రాజుని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? యాదమ్మ రాజు చేసిన తప్పేంటి? సాటి మనిషి అనుకున్న ఎవరికైనా ఇవే అనుమానాలు వస్తాయి. ఇక్కడ రాజుని ట్రోలింగ్ చేయడం వెనుక ఉన్న విషయం ఏంటి? అంటే..! రాజు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు ‘స్టెల్లా’. ఆమె క్రైస్తవులు అని పేరును బట్టి తెలుస్తుంది. రాజు హిందువులు. వీరి కులం, మతం పూర్తిగా వేరు. అయినా వాటికి అతీతంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు.

ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అయితే రాజు ఎంగేజ్మెంట్ లో అతను బొట్టు పెట్టుకోలేదట. అందుకు వచ్చింది ఇదంతా..! ‘తల్లిదండ్రుల పెంపకాన్ని.. పద్ధతుల్ని అన్నిటినీ గాలికివదిలేసావ్.. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ వాళ్ళ నమ్మకాన్ని కూడా చంపేశావ్.. సిగ్గులేదా నీకు’ అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా ఘోరం. సిగ్గు లేనిది రాజుకి కాదు వాళ్ళకి. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు అన్ని చోట్ల బొట్టు పెట్టుకుంటున్నారు.. చెప్పండి? ‘రాజుని ట్రోల్ చేసే వారంతా ఎంతో దిగజారిపోయినట్టే లెక్క’ అని చెప్పాలి..!

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus