Chiranjeevi , Ram Charan: చిరంజీవి, చరణ్ కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమా?

చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కినా చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించిన సినిమా మాత్రం ఆచార్య అనే సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన ఆచార్య ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. కథ, కథనం విషయంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ కు కారణమయ్యాయి. అయితే చిరంజీవి, చరణ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా బుచ్చిబాబు నాలుగేళ్లు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎమోషన్స్ కు సైతం భారీ స్థాయిలో ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్త గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తే ఈసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి, చరణ్ (Ram Charan) కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ మూవీలో నటించే లక్కీ హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ భారీ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పూర్తైన తర్వాత చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

చరణ్ బుచ్చిబాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ ను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. చరణ్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus