పుష్ప ది రైజ్ సినిమా 2021 సంవత్సరం డిసెంబర్ లో విడుదలై భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా విడుదలై దాదాపుగా రెండేళ్లు అవుతుండగా పుష్ప2 షూటింగ్ మాత్రం నిదానంగా జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కేవలం 30 శాతం మాత్రమే పూర్తైందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప2 రిలీజయ్యే అవకాశాలు లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమాను సుకుమార్ నెమ్మదిగా చెక్కుతుండటంతో జక్కన్నను మించి సుకుమార్ తీస్తున్నారా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు మైత్రీ నిర్మాతలు పుష్ప2 సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. పుష్ప2 సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ రావాలని అభిమానులు భావిస్తున్నారు. ఇతర స్టార్ హీరోల పెద్ద సినిమాలకు సంబంధించి వరుసగా అప్ డేట్స్ వస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ మూవీలో స్పెషల్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తాయి. దర్శకుడు సుకుమార్ వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు.