Ram Charan: చరణ్ నర్తన్ కాంబో మూవీకి నిర్మాతలు వాళ్లేనా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ వచ్చే ఏడాది శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చరణ్16 బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనుండగా చరణ్17 నర్తన్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. కన్నడ డైరెక్టర్ నర్తన్ డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే నర్తన్ మాత్రం చరణ్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. అయితే చరణ్ యూవీ క్రియేషన్స్ కాంబో మూవీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. చరణ్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.

చరణ్ సైతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ వేగంగా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తను హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా చరణ్ అడుగులు వేస్తున్నారు. చరణ్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.

చరణ్ శంకర్ కాంబో మూవీ కచ్చితంగా 2023లోనే విడుదలవుతుందని తాజాగా దిల్ రాజు నుంచి క్లారిటీ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వినిపిస్తుండగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ తర్వాత ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీస్థాయిలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus