రెండు భాగాలుగా మహేష్ రాజమౌళి మూవీ.. ట్విస్ట్ ఏంటంటే?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీ మరో బాహుబలి కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ సినిమా విషయంలో ప్రతి సన్నివేశాన్ని భారీగా ప్లాన్ చేశారని బోగట్టా.

ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేసేలా ఉండదని తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఈ సినిమాలో హాలీవుడ్ నటీనటులు కూడా నటించే ఛాన్స్ ఉందని బోగట్టా. మహేష్ రాజమౌళి కాంబో మూవీ గురించి తాజాగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ షూట్ ప్రారంభం కానుందని ఆయన అన్నారు.

ప్రేక్షకులకు ఇది ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ మూవీ ఒక అడ్వెంచర్ స్టోరీ అని ఆయన తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మహేష్ రాజమౌళి మూవీ షూట్ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ నాలుగేళ్ల పాటు ఈ సినిమాకు పరిమితం కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ ఫార్ట్ కు తేడా ఉంటుందని సెకండ్ పార్ట్ లో కథ మారుతుందని ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్తల గురించి రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ మధ్య కాలంలో రెండు భాగాలుగా తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో రాజమౌళి కూడా మహేష్ సినిమాను ఇదే విధంగా ప్లాన్ చేశారని బోగట్టా.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus