Unstoppable3: బాలయ్య షోలో పాల్గొననున్న చిరంజీవి.. ట్విస్ట్ ఏంటంటే?

ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో సీజన్1, అన్ స్టాపబుల్ షో సీజన్2 ఊహించని స్థాయిలో హిట్టైన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్3 త్వరలో ప్రసారం కానుందని చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున ఈ షోకు గెస్ట్ లుగా హాజరు కానున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది. ఆహా ఓటీటీ నిర్వాహకులు అన్ స్టాపబుల్ షో సీజన్3 లేకపోయినా కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ మాత్రం ప్లాన్ చేశారని పండుగల సందర్భంగా ఆ ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయని సమాచారం.

బాలయ్య హోస్ట్ గా చిరంజీవి గెస్ట్ గా ఒక స్పెషల్ (Unstoppable3) ఎపిసోడ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆహా ఓటీటీ ఇప్పటికే విశ్వక్ సేన్ హోస్ట్ గా ఒక షో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య చిరంజీవి కాంబినేషన్ ఎపిసోడ్ మాత్రం ఎప్పుడు స్ట్రీమింగ్ అయినా ఆహా ఓటీటీని షేక్ చేయడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఒకే ఫ్రేమ్ లో బాలయ్య, చిరంజీవి కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

ఆహా ఓటీటీతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. తక్కువ పారితోషికానికే బాలయ్య స్పెషల్ ఎపిసోడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య ఈ సినిమా పూర్తైన వెంటనే బాబీ సినిమాతో బిజీ కానున్నారు.

బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు బాలయ్య పారితోషికం పెరుగుతుండగా బాలయ్యకు కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus