Mega 156: చిరంజీవి వశిష్ట కాంబో మూవీలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు ఏకంగా 250 కోట్ల రూపాయలు అని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. చిరు వశిష్ట మూవీ లవ్ రొమాంటిక్ స్టోరీ అని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించనున్నారని రానా విలన్ గా కనిపిస్తారని తెలుస్తోంది.
సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మూడు లోకాలను కలుపుతూ సాగే లవ్ రొమాంటిక్ స్టోరీ అని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఒక చిన్నపిల్ల పాత్ర ఉంటుందని ఆ పాత్ర సినిమాకు చాలా కీలకమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తుందో చూడాల్సి ఉంది. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి. 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలలో ఒక సినిమా సక్సెస్ సాధిస్తుంటే మరో సినిమా ఫ్లాప్ అవుతుండటం ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తోంది.
చిరంజీవి తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. చిరంజీవి సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. చిరంజీవి పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం అందుతోంది. ఈ సినిమాకు(Mega 156) సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిరంజీవి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో కూడా చిరంజీవి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus