Hero Suriya: సూర్యకు థియేటర్ల ఓనర్లు భారీ షాకిస్తారా?

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరో సూర్య భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సూర్య నటించిన ఏ సినిమా విడుదలైనా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజవుతుంది. ప్రయోగాత్మక సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే స్టార్ హీరోగా హీరో సూర్యకు పేరుంది. గతేడాది ఆకాశం నీహద్దురా సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసి సూర్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో థియేటర్లు మూతబడటంతో స్టార్ హీరోల సినిమాలలో కొన్ని సినిమాలు ఓటీటీలలో రిలీజైన సంగతి తెలిసిందే. సూర్య హీరోగా తెరకెక్కిన జై భీమ్ సినిమా సైతం రేపు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. జ్యోతిక నటించిన పలు సినిమాలు సైతం ఓటీటీలో రిలీజయ్యాయి. వరుసగా సూర్య, సూర్య కుటుంబ సభ్యుల సినిమాలు ఓటీటీలో రిలీజవుతుండటంపై థియేటర్ల ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత సూర్య తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు కోలీవుడ్ ఇండస్ట్రీ సూర్యను బ్యాన్ చేయాలని అభిప్రాయపడుతున్నారు. అయితే సూర్య టీమ్ మాత్రం సూర్య నిర్ణయంలో ఏ తప్పు లేదని కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని చెబుతున్నారు. సూర్య భవిష్యత్తు సినిమాలకు థియేటర్ల ఓనర్లు షాకిచ్చే ఛాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus