Shraddha Srinath: శ్రద్ధాకు ఎయిర్ పోర్ట్ లో ఎదురైన సంఘటన..!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది నటి శ్రద్ధాశ్రీనాథ్. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ ‘అండ్‌ హిజ్‌ లీల’,‍ ‘మార’ సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటిస్తోంది. అలానే సౌత్ లో మిగిలిన భాషల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటి వెళ్లే క్రమంలో ఆమెకి ఎదురైన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది శ్రద్ధా.

సినిమా షూటింగ్ తరువాత ఎయిర్ పోర్ట్ కి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది ఈ బ్యూటీ. క్యాబ్ లో ప్రయాణించేప్పుడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ వేయమని అడిగితే డ్రైవర్ నిరాకరించాడట. పెట్రోల్ రేట్లు పెరగడం వలన క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది. ఎంతోకొంత డబ్బు పొదుపు చేయడానికి అలా చేశాడని.. అందుకే తను కూడా ఏం అనలేదని.. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోందని ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది.

అలానే తనకు ఎయిర్ పోర్ట్ లో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను తనను గుర్తుపట్టి.. దగ్గరకు వచ్చాడట. శ్రద్ధా శ్రీనాథ్ ఇన్స్టాగ్రామ్ లో తన అకౌంట్ వెతికి అతడిని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడట. దీంతో శ్రద్ధా సున్నింతంగా రిజెక్ట్ చేసిందట. దానికి అతను నో ప్రాబ్లెమ్.. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను.. మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడట. అలానే ఓ లేడీ తనను గుర్తించింది కానీ పేరు మర్చిపోయిందని.. దీంతో తనే పేరు చెప్పి పరిచయం చేసుకున్నట్లు వెల్లడించింది ఈ బ్యూటీ.

1

2

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus