సిరి షణ్ముఖ్ కు దగ్గర అవడానికి అదే కారణం: శ్రీహాన్

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సిరి శ్రీహన్ జంట ఒకటి. సిరి బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక ఈమె ప్రియుడు శ్రీహన్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. సిరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు రాక శ్రీహాన్ మాత్రం రన్నర్ గా బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత శ్రీహాన్ ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి సిరి హౌస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ తో కలిసి చాలా చనువుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి బాగా నెగిటివిటీ బయటకు స్ప్రెడ్ కావడంతో శ్రీహాన్ సిరిని వదిలేస్తారని అందరూ భావించారు. అయితే బిగ్ బాస్ తర్వాత తనకు శ్రీహాన్ కు పెద్ద గొడవ జరిగిందని బ్రేకప్ చెప్పుకునే వరకు పరిస్థితి వెళ్ళింది అంటూ తాజాగా సిరి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఇకపోతే తాజాగా సీజన్ సిక్స్ కార్యక్రమంలో కూడా శ్రీ హన్ శ్రీ సత్యకు దగ్గర అయ్యారు. వీరిద్దరూ కూడా కౌగిలించుకోవడం వంటివి చేయడంతో శ్రీహాన్ ను భారీగా ట్రోల్ చేశారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీహాన్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సిరి షన్ను రిలేషన్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను శ్రీ సత్యతో దగ్గరవడం గురించి ఈయన మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మానసికంగా ఒకరికొకరు దగ్గరయ్యే పరిస్థితిలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే గత ఏడాది సిరి విషయంలో కూడా అదే జరిగింది అంటూ ఈ సందర్భంగా శ్రీహాన్ చెప్పుకొచ్చారు.అయితే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు సిరి హౌస్ లోకి వెళ్లి శ్రీహాన్ కు ఏదో చెప్పిందని అందుకే అప్పటినుంచి శ్రీహాన్ గేమ్ పై శ్రద్ధ పెట్టి ఏకంగా టాప్ 2 పొజిషన్ కి వెళ్లారని చెప్పాలి. మొత్తానికి శ్రీహాన్ సిరి, షన్ను రిలేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus