Shrihan, Inaya: ఇంట్లో అసలైన ఊసరవెల్లి అంటూ రగిలిపోయిన శ్రీహాన్..! ఇనయ ఏం చేసిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ టాస్క్ ఆడియన్స్ కి మంచి మజా ఇచ్చింది. ఎట్టకేలకి చేపల చెరువు టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ గేమ్ ఆడారు. అంతేకాదు, ఫిజికల్ టాస్క్ అయినా కూడా లేడీ కంటెస్టెంట్స్ చాలా కష్టపడి మరీ ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా చేపల బుట్టలని కాపాడటంలో ముఖ్యపాత్రని పోషించారు. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. వాళ్లలో వాళ్లే డిసైడ్ చేస్కోమని కండీషన్ పెట్టాడు. దీంతో ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు.

వీళ్లకి చిక్కుముడులు విప్పాలనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ముగ్గురు గెలిచారు. కీర్తి, శ్రీహాన్, ఇంకా సూర్యలు గెలిచారు. దీంతో బిగ్ బాస్ కెప్టెన్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ల కత్తిపోట్లు ఎదుర్కోవాలనే టాస్క్ ఇచ్చాడు. ఇక్కడే రాజ్, రోహిత్, రేవంత్ ముగ్గురూ సూర్యకి కత్తిపోట్లు దింపారు. బాలాదిత్య, గీతు కీర్తికి కత్తిపోట్లు దింపారు. ఇక ఇనయ గేమ్ లో ట్విస్ట్ ఇచ్చింది. అందరూ సూర్యకి కత్తిపోటు దింపుతుందని అనుకున్నారు. కానీ, శ్రీహాన్ కి కత్తిని దింపి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ బాగా హర్ట్ అయ్యాడు.

కేవలం ఇనయ ప్రోమో కోసం, కంటెంట్ కోసమే ఇలా చేసిందని అన్నాడు. అంతేకాదు, ఇంట్లో బాగా డ్రామాలు ఆడుతోందని, ఇంట్లో అసలైన ఊసరవెల్లి తనే అని అన్నాడు. అంతేకాదు, స్టేబులిటీ లేదని నన్ను అన్నది కానీ, తనకే లేదని, వారానికో రంగు మారుస్తోందని, నాగార్జున గారు సూర్యది తనది బాండింగ్ బాగుందంటే, అటువైపు వెళ్లిపోతుందని, నాది తనది ఫైటింగ్ బాగుందని చెప్పారు కాబట్టే ఇలా చేసిందని చెప్పాడు. ఇక బాగా రగిలిపోయాడు. నాకు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా అన్నాడు. నిజానికి ఇనయ చాలాసేపు ఆలోచించి ఈ డెసీషన్ తీస్కుంది.

అంతకుముందు ఏం జరిగిందంటే.,

హౌస్ మేట్స్ వాసంతీ , కీర్తి ఇనయతో మాట్లాడుతూ సూర్యకి నువ్వంటే సాఫ్ట్ కార్నర్ అలాగే ఉందని చెప్పారు. తనకి హెల్ప్ చేయాలని అన్నాడని అన్నారు. దీంతో ఇనయ కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకోగానే సూర్యని గట్టిగా కౌగిలించుకుని బాధపడింది. దీని తర్వాత మరోసారి సూర్యవైపు గాలి మల్లింది. దీంతో సూర్యకి ఓటు వేయాలని అనిపించలేదు. అంతేకాదు, ఇక్కడ ఇనయ చెప్పిన రీజన్ కూడా శ్రీహాన్ కి ఫన్నీగా అనిపించింది. ఇక శ్రీహాన్ బాగా హర్ట్ అయ్యాడు. దీంతో వచ్చేవారం నామినేషన్స్ లో రచ్చ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఇక మిగతా హౌస్ మేట్స్ సపోర్ట్ తో శ్రీహాన్ కెప్టెన్ అయినట్లుగా సమాచారం. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus