Shrihan, Revanth: శ్రీహాన్ 40 లక్షలు తీస్కోవడం పై సోషల్ మీడియాలో రచ్చ..! ట్రోల్స్ ఆగట్లేదు భయ్యా..!

బిగ్ బాస్ రియాలిటీ షో అట్టహాసంగా ముగిసింది. సీజన్ – 6 ఈసారి ఫ్లాప్ అయినా కూడా ఫినాలే రోజున నాగార్జున చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. గెలిచినా కూాడ రేవంత్ కి ఆనందం లేకుండా చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా రేవంత్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. స్వల్ప మార్జిన్ తో శ్రీహాన్ టాప్ – 1 లో ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, విన్నర్ కి 10లక్షలు ఇచ్చి రన్నరప్ అయిన శ్రీహాన్ కి 40లక్షలు ఇచ్చారని, అందుకే నాగార్జున శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని అబద్దం చెప్పేశారని అంటున్నారు.

సింపుల్ గా బిగ్ బాస్ చేసిన మిస్టేక్ ని ఇలా కవర్ చేస్కున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ ఫ్యాన్స్ అసలు సిసలైన విన్నర్ రేవంతే అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సోషల్ మీడియాలో మిగతా వాళ్లని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎలిమినేట్ అయిన టాప్ – 5 మెంబర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ఇంటర్య్వూస్ ఇస్తున్నారు. దీంతో టాప్ – 5 కంటెస్టెంట్స్ కి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. వాళ్ల ఇంటర్య్వూస్ కింది ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీహాన్ 40లక్షల సూట్ కేస్ తీస్కున్న తర్వాత ఆటోమేటిక్ గా రేవంత్ ని విన్నర్ గా డిక్లేర్ చేశాడు కింగ్ నాగార్జున. ఒకవేళ శ్రీహాన్ 40 లక్షలు సూట్ కేస్ తీస్కోకపోతే శ్రీహాన్ విన్నర్ అయ్యేవాడా అని ప్రశ్నిస్తున్నారు. అసలు దరిదాపుల్లో కూడా ఓటింగ్ లో లేడని, అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో ఎక్కడ చూసినా రేవంత్ కే హ్యూజ్ గా ఓటింగ్ జరిగిందని అంటున్నారు. అలాంటపుడు నాగార్జున ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందని ,

దీనివల్ల రేవంత్ ట్రోఫీ గెలిచినా కూాడ ఆనందం లేకుండా పోయిందని వాపోతున్నారు. మరోవైపు 40లక్షలు తీస్కున్న శ్రీహాన్ పబ్లిక్ ఓటింగ్ లో టాప్ ఉన్నానని అసలైన విన్నర్ నేనే అని ఇంటర్య్వూస్ ఇస్తున్నాడు. దీంతో రేవంత్ ఫ్యాన్స్ కి ఇంకా మండుతోంది. ఈ ఇంటర్య్వూ కింద కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ట్రోల్ చేసే వాళ్లు కూడా అసలు విన్నర్ ఎవరు బిగ్ బాస్ అంటూ మీమ్స్, ట్రోల్స్ మొదలుపెట్టారు.

నాగార్జున ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా షోని ముగించేసి ఉన్నా కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వారికి ఉండేది. అయితే, ఇక్కడ రన్నర్ కి 40లక్షలు క్యాష్ ఇవ్వడంపైనే చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఏ సీజన్ లో కూడా ఫైనలిస్ట్ లకి ఇంత్ పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేయలేదు. ఇప్పుడు శ్రీహాన్ కి సూట్ కేస్ తో పాటుగా, పబ్లిక్ ఓటింగ్ ప్రకారం విన్నర్ అనే క్రెడిట్ కూడా ఇచ్చారు. దీంతో అసలు సిసలైన విన్నర్ శ్రీహానే అనే అందరికీ తెలుస్తోంది.

కానీ, ఓటింగ్ ప్రకారం అన్ అఫీషయల్ పోల్స్ మొత్తం రేవంత్ నే సపోర్ట్ చేశారు అందరూ. బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 విన్నర్ రేవంత్ అనే ఫిక్స్ అయ్యారు కూడా. ఇప్పుడు కేవలం షో గురించే, రేటింగ్ గురించే ఇదంతా చేశారని, ఇంత డ్రామా ఆడాల్సి వచ్చిందని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా తెలుగు సీజన్ – 6 మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫైనల్ గా ఇద్దరు విన్నర్స్ ని తెరపైన చూపించారు. అదీమేటర్.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus