డి-గ్లామర్ రోల్‌కి శ్రియ పర్ఫెక్ట్ అనుకుని సెలెక్ట్ చేశామన్నారు

శ్రియ బర్త్‌ డేకి ‘గమనం’లో ఆమె లుక్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌కి ఆ లుక్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ క్యారెక్టర్లు చేసిన శ్రియ, ‘గమనం’లో డీ-గ్లామర్ లుక్‌లో డిఫరెంట్‌గా ఉంది. దానికి ఆమెను సెలెక్ట్ చేసే ముందు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్న సుజనారావు, డీ-గ్లామర్ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని అనుకోలేదట. “కెరీర్‌లో గ్లామరస్ క్యారెక్టర్లు చేసిన శ్రియ, డీ-గ్లామర్ క్యారెక్టర్‌కి రైట్ ఛాయిస్ అవుతుందా? అనేది నాకు తెలియదు.

కాని స్క్రిప్ట్ నేరేషన్ ఇవ్వడానికి కలిశా. నేరేషన్ ఎండింగ్‌లో శ్రియ ఏడ్చింది. రైట్ పర్సన్ దొరికిందని అప్పుడు అనుకున్నా” అని సుజనారావు అన్నారు. లాస్ట్ ఇయర్ ‘గమనం’ షూట్ కంప్లీట్ చేశారు. లాక్‌డౌన్‌లో ఇళయరాజా రీరికార్డింగ్ కూడా కంప్లీట్ చేశారు. నిజానికి, ఆయనను రీరికార్డింగ్ చెయ్యమని ఇళయరాజాను అడగడానికి సుజనారావు సందేహించారట. అయితే, ఆయనే కాల్ చేసి వర్క్ చెయ్యడానికి రెడీ అనడంతో వీడియో కాల్ ద్వారా వర్క్ కంప్లీట్ చేశారట.

మూడు కథలతో కూడిన సంకలనంగా ‘గమనం’ తెరకెక్కిందని సుజనారావు తెలిపారు. యాంథాలజీగా రూపొందిస్తున్నారు. ఒక కథలో శ్రియ నటించగా, మరో కథలో శివ కందుకూరి, ఇంకో కథలో ప్రియాంకా జవాల్కర్ యాక్ట్ చేశారు. ఒక కథను తెలుగులో, మరో కథను హిందీ షూట్ చేశారు. ఇంకో కథలో డైలాగులు లేవు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus