Shriya Saran: బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డాను.. హీరోయిన్ వ్యాఖ్యలు!

ప్రముఖ నటి శ్రియ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చాలా కాలం పాటు ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచింది. తన కూతురికి తొమ్మిది నెలలు వచ్చిన తరువాత ఆ విషయాన్ని బయట ప్రపంచానికి వెల్లడించింది. ఇప్పుడు సినిమాలు, ఫొటోషూట్లు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. రెండేళ్ల క్రితం ఈ బ్యూటీ నటించిన ‘గమనం’ అనే సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలానే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో కీలకపాత్ర పోషించింది శ్రియ.

ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది శ్రియ. ఆమె చాలా ఫిట్ గా కనిపిస్తుండడంతో.. మీడియా తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి ప్రశ్నించింది. దాంతో తను మళ్లీ ఎలా షేప్ లోకి వచ్చిందో వెల్లడించింది. తల్లి అయిన తరువాత తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని.. బాగా లావయ్యానని చెప్పింది. డెలివెరీ తరువాత కొన్నాళ్లు అలానే ఉన్నానని.. కానీ తరువాత వర్కవుట్ చేసి.. కథక్ డాన్స్ చేస్తూ ఫిట్నెస్ సాధించానని చెప్పింది.

యోగా చేయడం వలన కూడా తనకు బాగా హెల్ప్ అయిందని చెప్పుకొచ్చింది. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు చేస్తానని.. వర్క్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలనని చెప్పింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus