మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘జై చిరంజీవ’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి ఈ చిత్రం పెద్ద హిట్టేమీ కాదు.. కానీ ఇందులోని కామెడీ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మెగాస్టార్ లోని కామెడీ యాంగిల్ ను నెక్స్ట్ లెవెల్లో పరిచయం చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చడంతో అదిరిపోయే పంచ్ లు పేలాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో చిరంజీవి మేనకోడలు పాత్రలో కనిపించిన పాపను ఎవ్వరూ మర్చిపోలేరు.
ఆమె పేరు శ్రియ శర్మ. అటు తరువాత ఈమె హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘దూకుడు’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. రజినీకాంత్ ‘రోబో’(అతిథి పాత్ర) లోనూ ఈమె కనిపించింది.అంతేకాదు ‘గాయకుడు’ చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది.తరువాత శ్రీకాంత్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘నిర్మల కాన్వెంట్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది శ్రియా శర్మ.
ఈ చిత్రాన్ని మన కింగ్ నాగార్జున నిర్మించారు.ఇదిలా ఉండగా..శ్రియ శర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :