Shruthi Hassan: చిరంజీవి బాలయ్య డాన్స్ ల గురించి శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్!

సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా సెలబ్రిటీలకు జాతర అని చెప్పాలి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున హీరోలు సంక్రాంతి బరిలో దిగుతూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటారు. ఈ విధంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్నటువంటి చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు పోటీ పడిపోతున్నారు. మరి ఈ పోటీలో విజయం ఎవరి సొంతమవుతుందోనని ఇరువురి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ రెండు సినిమాలలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్ కు ఒక టిపికల్ ప్రశ్న ఎదురయింది.

ఈమె చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు హీరోలతో కలిసి నటించారు. అయితే డాన్స్ పరంగా ఎవరు అద్భుతమైన డాన్స్ చేస్తారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ… మాస్ స్టెప్పులు వేసే విషయంలో బాలకృష్ణ తోపు అంటూ సమాధానం చెప్పారు…ఇక క్లాస్ మాస్ కలిపి కొట్టడంలో చిరు కేక అంటూ సమాధానం చెప్పారు. ఇలా ఏ హీరో అభిమానులు హార్ట్ కాకుండా ఇద్దరిని సమానంగా భావిస్తూ డాన్స్ విషయంలో శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus