Shruthi Hassan: ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు: శృతిహాసన్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కెరియర్ మొదట్లో వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్న అనంతరం సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. ఇలా వృత్తిపరంగా కెరియర్ల ముందుకుపోతున్న ఈమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే రవితేజ నటించిన క్రాక్ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీలో హిట్ కొట్టారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో శృతిహాసన్ వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె సలార్, గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగులతో బిజీగా ఉన్న శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ సహజీవనం చేస్తూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదు.

ఇలా వీరిద్దరు ప్రేమించుకుని సహజీవనం చేయడంతో శృతిహాసన్ ఎక్కడికి వెళ్లినా ఈమె పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూ ఉంటాయి.ఇదివరకే పెళ్లంటే తనకు భయం అని సమాధానం చెప్పిన శృతిహాసన్ కు మరోసారి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఈమె ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ కి కెరీర్ కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఎదురవుగా వాటికి సమాధానం చెప్పింది.

ఈ క్రమంలోనే మీ పెళ్లి ఎప్పుడు అంటూ వ్యక్తిగత విషయం గురించి ప్రశ్నించారు. ఇక పెళ్లి గురించి శృతిహాసన్ సమాధానం చెబుతూ… మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదంటూ మరోసారి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న ఈమె పెళ్లి విషయం అనేసరికి వెనకడుగు వేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus