వైజాక్ లో సూర్య, శృతి హాసన్..!

తమిళ నటుడు సూర్య వరుస హిట్ల తో జోరు మీద ఉన్నారు. తనకు మంచి విజయాన్ని అందించిన సింగం, సింగం -2 చిత్రాలకు సీక్వెల్ గా సింగం 3 తీస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో సూర్యకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎస్ -3 మూవీని ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నెల్లూరు లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. నిన్నటి నుంచి వైజాక్ లో సూర్య, శృతిహాసన్ ల పై రొమాంటిక్ సీన్లను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో శృతి, అనుష్క తో కలిసి స్క్రీన్ ని పంచుకోనుంది. మొన్నటి వరకు తండ్రి కమల్ హాసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న “శెభాష్ నాయుడు” సినిమాకోసం లాస్ ఏంజిల్స్ లో ఉన్న శృతి.. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుని సింగపూర్ లో జరిగిన సైమా అవార్డుల వేడుకకు హాజరయ్యారు. అక్కడ శ్రీమంతుడు సినిమాలో నటనకు గాను ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

ఆ హడావుడి పూర్తి అయిన వెంటనే వైజాక్ కు బయలు దేరారు. “చాలా కాలం తర్వాత సూర్యతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఎస్ 3 కోసం వైజాక్ కు వెళ్తున్నాను” అని ఆమె ఫ్లయిట్ ఎక్కేముందు పోస్ట్ చేశారు. శృతి హాసన్ సూర్యతో కలిసి ఐదేళ్ల క్రితం “7th సెన్స్ లో నటించారు. మళ్లీ వీరిద్దరూ ఎస్ త్రీ కోసం జత కట్టారు. శుక్రవారం వైజాక్ ప్రధాన రోడ్లపై శృతి హాసన్ స్కూటీ మీద వెళుతున్న సీన్ ను చిత్రీకరించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువ షేర్లు అందుకుంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus