Shruti Haasan: చాలా మంది డౌట్స్‌ క్లియర్‌చేసి శ్రుతి హాసన్‌!

శ్రుతి హాసన్‌ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, గూగుల్‌లో ఆమె గురించి వస్తున్న ప్రశ్నలేంటి, ఆమె జీవితం గురించి ఎలాంటి విషయాలు సెర్చ్‌ చేస్తున్నారు… వాటన్నింటికి శ్రుతి సమాధానాలేంటి? బాగుంది కదా ఈ కాన్సెప్ట్‌. ఓ ఇంగ్లిష్‌ మీడియా శ్రుతి హాసన్‌తో ఇలాంటి కాన్సెప్ట్‌ను రన్‌ చేసి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా పర్సనల్‌ లైఫ్‌ గురించి, ప్రొఫెషనల్‌ లైఫ్ గురించి శ్రుతి హాసన్‌ చెప్పుకొచ్చింది. శ్రుతి హాసన్‌ను అడిగిన ప్రశ్నలు చాలావరకు మనం చూసినవి, విన్నవే.

Click Here To Watch

అయితే ఇప్పుడు మరోసారి ఆమె నుండి క్లారిటీ వచ్చిందనుకోవచ్చు. గూగుల్‌ ప్రశ్నల్లో తొలుత ‘మీ ఫోన్‌ నంబర్‌ ఏంటి అని’ అడగ్గా.. 100 అని ఇంతకుముందే చెప్పానుగా అని శ్రుతి హాసన్‌ బదులిచ్చింది. ఇక రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి అడగ్గా.. ‘ఓహ్‌, మీ నెక్స్ట్‌ క్వశ్చన్‌ ఏంటో నాకు తెలుసు… శ్రుతి హాసన్‌ ప్రియుడు శంతను హజారిక ఎవరు? ఇదేగా..’ అని ప్రశ్న ముందే ఊహించి చెప్పేసింది శ్రుతి హాసన్‌. అంతేకాదు దానికి కారణం కూడా చెప్పింది.

నేను కూడా నా గురించి గూగుల్‌ చేశాను. అక్కడ కనిపించిన ప్రశ్నలు చూసి తెగ నవ్వుకున్నాను అని చెప్పింది శ్రుతి. ఆ తర్వాత తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ గురించి చెప్పింది. ‘నేను డేటింగ్‌లో ఉన్నాను’ అని శ్రుతి హాసన్‌ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇంకా మిగిలిన విషయాలు అయితే ఏం చెప్పలేదు. ఆ తర్వాత ‘మీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది?’ అనే ప్రశ్న వేశారు. దానికి ఆమె సరదాగా ‘ ప్రస్తుతం శ్రుతి హాసన్‌ ఈ విషయం కనుగొనే పనిలోనే ఉంది’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఆ ఆస్తి ఇంకా పెరగాలనుకుంటోంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి హాసన్‌ తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో ‘సలార్‌’లో నటిస్తోంది. ఇది కాకుండా బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమాకు ఓకే చెప్పింది. చిరంజీవితో కూడా ఓ సినిమాలో నటిస్తోంది. హిందీలో ఆమె నటించి ‘బెస్ట్‌ సెల్లర్‌’ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus