హీరోలంటే ఏడాదికో సినిమా చేసుకున్నా పర్లేదు కానీ హీరోయిన్లకు మాత్రం అలా కాదు కదా.. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు పట్టుకు తిరుగుతుంటారు.. అలా చేస్తేనే వాళ్లకి వర్కౌట్ అవుతుంది.. ఇక స్టార్ లేదా మోస్ట్ వాంటెడ్ భామలైతే మాత్రం తమ సినిమాల్లో బుక్ చేసుకోవడానికి డేట్స్ దొరక్క దర్శక నిర్మాతలకి తిప్పలు తప్పవు.. హైలెట్ ఏంటంటే ఇప్పుడలాంటి కన్ఫ్యూజన్ సిచ్చుయేషన్ సౌత్ బ్యూటీ శృతి హాసన్‌కి వచ్చి పడింది..
సంక్రాంతికి రాబోయే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ రెండు సినిమాల్లోనూ శృతినే కథానాయికగా చేస్తుంది.. పైగా రెండిటికీ మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మాతలు కాబట్టి పేమెంట్ పరంగా ప్రాబ్లమ్ ఉండదు.. రెండు సినిమాలూ సంక్రాంతి బరిలోకే దిగుతుండడంతో రిజల్ట్ విషయంలో శృతి పడుతున్న టెన్షన్ గురించే ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.. 2001 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మృగరాజు’, నటసింహ బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ చిత్రాలు ఒకరోజు తేడాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాయి..
రెండిట్లోనూ సిమ్రానే హీరోయిన్.. అప్పట్లో తను టాప్ అండ్ క్రేజీ స్టార్.. బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొడితే, చిరు డిజాస్టర్ అందుకున్నాడు.. తర్వాత కొన్నాళ్లపాటు సిమ్రాన్‌కి వరుసగా ఫ్లాప్సే వచ్చాయి.. కొద్దిరోజులకి కనిపించకుండా పోయింది.. శృతి హాసన్ విషయానికొస్తే.. కొంత గ్యాప్ తర్వాత ‘క్రాక్’ లో మంచి క్యారెక్టర్ చేసి కమ్‌బ్యాక్ ఇచ్చింది..
రవితేజ, శృతి, గోపిచంద్ మలినేని ముగ్గురూ ‘క్రాక్’ తోనే ట్రాక్‌లోకి వచ్చారు.. ఫ్యాన్ బోయ్‌గా ‘వీర సింహా రెడ్డి’ తీస్తున్నాను.. సూపర్ హిట్ గ్యారంటీ అంటున్నాడు డైరెక్టర్.. బాలయ్య ద్విపాత్రాభినయం.. కొడుకు క్యారెక్టర్‌కి జోడీగా కొన్ని సీన్లు, సాంగ్స్‌లో మాత్రం కనిపించినా కానీ క్రెడిట్ బాలయ్య, దర్శకుడికే వెళ్లిపోతుంది..
‘వాల్తేరు వీరయ్య’ కంప్లీట్ మెగాస్టార్ ఇమేజ్ బేస్ చేసుకుని తెరకెక్కుతున్న మాస్ మూవీ.. వింటేజ్ చిరుని చూడ్డానికి ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఉన్నారు.. సినిమాలో తన రోల్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా కానీ చిరు సునామీలో కొట్టుకుపోవడం ఖాయమనే చెప్పాలి.. ఈ లెక్కన చూసుకుంటే పక్కా రెండు సినిమాలు హిట్ అయితేనే కానీ తనకి సిమ్రాన్ లాంటి పరిస్థితి రాదు.. అప్పడంటే అంత మీడియా, సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది.. ఇప్పుడు ఏదైనా చిన్న తేడా వస్తే చాలు దారుణంగా ట్రోలింగ్ చేస్తారని టెన్షన్ పడుతోందట శృతి హాసన్..