టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ఈ ఏడాది జనవరి నెలలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయాలను అందుకుంటున్నారు. చర్మంపై పదేపదే మేకప్ లను అప్లై చేయకూడదని ఆమె చెప్పుకొచ్చారు. మేకప్ ను శరీరంపై అప్లై చేయడం వల్ల కెమికల్స్ స్వేద గ్రంథుల్లోకి వెళతాయని శృతి హాసన్ కామెంట్లు చేశారు. ఈ కెమికల్స్ వల్ల హార్మోన్ల అసమతుల్య సమస్యలు తలెత్తుతాయని శృతి హాసన్ వెల్లడించారు. ఈ కెమికల్స్ వల్ల వచ్చే మొటిమల వల్ల ప్రమాదం ఉందని శృతి హాసన్ అన్నారు.
ఆ తర్వాత చర్మం జిడ్డుగా తయారవుతుందని ఆమె కామెంట్లు చేశారు. కొన్నిసార్లు చర్మం కాంతి, రంగు మారే ఛాన్స్ అయితే ఉంటుందని శృతి చెప్పుకొచ్చారు. చర్మానికి అవసరమైన సమయంలో సప్లిమెంట్లను వాడాలని నేను కూడా అలాగే వాడానని ఆమె కామెంట్లు చేశారు. రసాయనాలు ఎక్కువగా ఉన్న కాస్మొటిక్స్ నాకు నచ్చవని ఆమె తెలిపారు. జుట్టుకు కొబ్బరి నూనె రాసుకుంటానని శుద్ధమైన కొబ్బరి నూనె వల్ల జుట్టుకు మేలు జరుగుతుందని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.
కిచెన్ లో దొరికే దినుసులతో ఫేస్ మాస్క్ వేసుకోవడం అలవాటు అని శృతి కామెంట్లు చేశారు. వేర్వేరు పదార్థాలతో ఫేస్ మాస్క్ వేసుకోవచ్చని శృతి హాసన్ వెల్లడించారు. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగుతానని ఆమె పేర్కొన్నారు. ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుందని శృతి తెలిపారు. ఎండకు వెళ్తే ముఖంపై నల్లటి మచ్చలు రాకుండా బంగాళదుంపల రసాన్ని రాస్తానని శృతి తెలిపారు.
చర్మ సౌందర్యానికి సమతుల ఆహారం ఎంతో అవసరం అని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. ఉదయం ఇడ్లీలు, కోడిగుడ్లు, తాజా పండ్లు ఉండాలని కోరుకుంటానని శృతి తెలిపారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, సలాడ్స్, పాస్తా తీసుకుంటానని శృతి హాసన్ కామెంట్లు చేయడం గమనార్హం.