Shruti Haasan: మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అంటూ ప్రశంసలు కురిపించిన డైరెక్టర్!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా వెండితెర అరంగ్రేటం చేసి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో వరుస ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొన్నప్పటికీ అనంతరం అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఇండస్ట్రీలో కొనసాగారు. అయితే ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఈ సినిమాతో ఈమె తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవడంతో శ్రుతిహాసన్ వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి సందడి చేశారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్,ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న శృతిహాసన్ మరోసారి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ లొకేషన్ లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటోని డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోని గోపీచంద్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ ఫేవరెట్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం NBK107 సెట్ లో ఉందంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇకపోతే శృతిహాసన్ గోపీచంద్ కాంబినేషన్ లో ఇది వరకే వచ్చిన బలుపు, క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన విన్నపం మేరకు బాలకృష్ణ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు. ఇక బాలయ్యతో మాత్రమే కాకుండా శృతిహాసన్ మెగాస్టార్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus