సెట్ నుండి హీరోయిన్ వాకౌట్.. కారణమిదే!

  • November 23, 2020 / 06:26 PM IST

కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి శృతిహాసన్. నటిగానే కాకుండా సింగర్ గా కూడా ఫేమస్ అయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ వెలుగొందిన ఈ బ్యూటీ బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించి.. తిరిగి సౌత్ కి వచ్చి సెటిల్ అయింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ సినిమాలు అంగీకరిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమె విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ‘లాభం’ అనే సినిమాలో నటిస్తోంది.

ఎస్పీ జననాథన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ధర్మపురి, క్రిష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సహజంగానే షూటింగ్ అంటే ఎగబడే జనాలు ఈ సినిమా షూటింగ్ చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారట.దీంతో శృతిహాసన్ షూటింగ్ మధ్యలోనే సెట్ నుండి వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా తెలియని వాళ్లని కలవడం, గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో ఉండడం మంచిది కాదని భావించిన శృతి.. షూటింగ్ మధ్యలోనే ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోయిందని కోలీవుడ్ మీడియా వర్గాలు వార్తలు ప్రచురిస్తున్నాయి.

కరోనాని దృష్టిలో పెట్టుకునే శృతి అలా చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘క్రాక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus