Shruti Haasan: సలార్ లో శృతి పాత్ర అలా ఉండనుందా.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. సలార్ మూవీలో సాంగ్స్ లేవని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు శృతి పాత్రకు సంబంధించి షాకింగ్ విషయాలను రివీల్ చేశారు.

ఈ సినిమాలో (Shruti Haasan) శృతి హాసన్ రోల్ టీచర్ రోల్ అని తాము పాఠాలను వినే విద్యార్థినులుగా కనిపిస్తామని వాళ్లు చెప్పుకొచ్చారు. సలార్ లో శృతి హాసన్ రోల్ లీక్ కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. టీచర్ పాత్రకు శృతి హాసన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని సమాచారం అందుతోంది. శృతి హాసన్ రోజుకో భాష చొప్పున డబ్బింగ్ చెబుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ట్రైలర్ లో శృతి హాసన్ పాత్రకుప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్, శృతి హాసన్ కాంబో సీన్లు అదుర్స్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్1 షాకింగ్ ట్విస్ట్ తో ముగియనుందని సలార్2 మూవీ సలార్1 ను మించి ఉండనుందని సమాచారం. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ సలార్, సలార్2, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాలతో కొన్ని నెలల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకుని పభాస్ రేంజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus