Shruti Hassan: పాత్రలను రివీల్ చేసిన శృతి హాసన్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా శృతి హాసన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి, బాలకృష్ణ లెజెండ్స్ అని వాళ్లతో కలిసి నటించడం నా లక్ అని శృతి హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతంలో కూడా నేను హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయని ఆమె కామెంట్ చేశారు. రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవుతుండటంతో సంతోషంగా ఉందని ఆమె కామెంట్ చేశారు. రెండు సినిమాలలో రెండు భిన్నమైన పాత్రలలో కనిపిస్తానని ఒక పాత్రకు మరో పాత్రకు పొంతన ఉండదని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. వీరసింహారెడ్డి సినిమాలో నా పాత్ర ఫన్ యాంగిల్ లో ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

వాల్తేరు వీరయ్య సినిమాలో నాకు ఫైట్ ఉంటుందని శృతి హాసన్ వెల్లడించడం గమనార్హం. చిరంజీవి, బాలయ్యలతో కలిసి డ్యాన్స్ చేయడం మంచి అనుభూతి అని శృతి హాసన్ పేర్కొన్నారు. సుగుణ సుందరి, శ్రీదేవి చిరంజీవి సాంగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆమె వెల్లడించడం గమనార్హం. అనారోగ్యం వల్లే వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు హాజరు కాలేకపోయానని శృతి హాసన్ కామెంట్లు చేశారు.

వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టమని వైజాగ్ ఈవెంట్ ను మిస్ కావడం బాధ కలిగించిందని శృతి హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సలార్ మూవీలో నటిస్తున్నానని శృతి హాసన్ పేర్కొన్నారు. శృతి హాసన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus