Shruti Haasan: బాయ్ ఫ్రెండ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ముక్కుసూటిగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లతో శృతి హాసన్ బిజీగా ఉన్నారు. ఒకవైపు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి కూడా శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా శృతి తన బాయ్ ఫ్రెండ్ శంతను గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాలలో మూడు సినిమాలను తాను, శంతను కలిసి చూశామని అయితే తాను హీరోయిన్ గా తెరకెక్కిన ఒక్క సినిమాను కూడా శంతను పూర్తిగా చూడలేదని శృతి అన్నారు.

Click Here To Watch

వాస్తవం చెప్పాలంటే కుదురుగా కూర్చుని నా సినిమాలను చూసే అవకాశం తాను శంతనుకు ఇవ్వనని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. ఒకరికొకరం సలహాలు ఇచ్చుకోవడం మాత్రం జరగదని ఆమె తెలిపారు. నా వర్క్ నచ్చితే శంతను తనను మెచ్చుకుంటాడని అతని వర్క్ నచ్చితే నేను తనను మెచ్చుకుంటానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. తాను ప్రొఫెషనల్ ఆర్టిస్టును కాదని పెయింటర్ ను కాదని డిజైనర్ ను కాదని శృతి కామెంట్లు చేశారు. అందువల్ల బాయ్ ఫ్రెండ్ కు సలహాలు ఇచ్చేంత సీన్ తనకు లేదని శృతి చెప్పుకొచ్చారు.

అతడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడని శృతి హాసన్ వెల్లడించారు. శంతను కూడా తనకు ఎటువంటి సలహాలు ఇవ్వడని శృతి హాసన్ పేర్కొన్నారు. ఇద్దరం ఖాళీ సమయాలలో కలుసుకుంటామని ఒకరి పనులను మరొకరం చేసుకుంటామని శృతి పేర్కొన్నారు. లవ్ మ్యాటర్ ను బయటపెట్టడం బయటపెట్టకపోవడం వ్యక్తిగతమని శృతి వెల్లడించారు.

కెరీర్ తొలినాళ్లలో ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టడానికి తాను ఇబ్బంది పడ్డానని ఆమె అన్నారు. తర్వాత రోజుల్లో మెచ్యూరిటీ పెరిగి లవ్ మ్యాటర్ ను బయటపెట్టానని ఆమె అన్నారు. శంతను వర్క్ లో తాను వేలు కూడా పెట్టనని శృతి హాసన్ తెలిపారు.

1

2

3

4

5

6

7

8

9

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus