Rajinikanth: ‘డాన్’ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్!

సీనియర్ హీరోలు చాలా మంది వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. సూపర్ రజినీకాంత్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లలో అమెరికా వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ‘రోబో’ సినిమా సమయంలో తలెత్తిన ఆరోగ్య సమస్యల వలన డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినా.. రజినీకాంత్ మాత్రం సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నారు.

ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అతడు మరెవరో కాదు.. సిబి చక్రవర్తి. శివకార్తికేయన్ హీరోగా ‘డాన్’ అనే సినిమాను తెరకెక్కించారు సిబి చక్రవర్తి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఆ సినిమా చూసిన రజినీకాంత్.. సిబి చక్రవర్తిని కలిశారు. అంతేకాదు.. సిబి చక్రవర్తితో ఓ కథ కూడా చెప్పించుకున్నారు.

కథ నచ్చడంతో రజినీకాంత్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఏ జోనర్ లో సినిమా తీయబోతున్నారు..? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా కాకుండా లైకా ప్రొడక్షన్ లో మరో సినిమా చేయబోతున్నారు రజినీ. ఆ సినిమాకి ఇంకా డైరెక్టర్ ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాలు చర్చల దశలోనే ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో రజినీకాంత్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. కోలీవుడ్ సంగతి పక్కన పెడితే తెలుగు మార్కెట్ అయితే బాగా డౌన్ అయింది. అతడి నుంచి చివరిగా వచ్చిన ‘పెద్దన్న’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం అయితే ‘జైలర్’ సినిమాపై అంచనాలైతే బలంగా ఉన్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus