Bommarillu Re-release: సిద్దార్థ్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోందిగా.. మరో హిట్ సాధిస్తారా?

సిద్దార్థ్ హీరోగా ఆనంద్ రంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఓయ్ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా రీరిలీజ్ కావడంతో పాటు అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా రీరిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే బొమ్మరిల్లు సినిమా రీరిలీజ్ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. సిద్దార్థ్ పుట్టినరోజు కానుకగా సినిమా రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సిద్దార్థ్ సినీ కెరీర్ లో బొమ్మరిల్లు సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిల్ రాజు బ్యానర్ రేంజ్ పెంచిన సినిమాలలో ఈ సినిమా ఒకటని చెప్పవచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జెనీలియా తన పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమా రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన సిద్దార్థ్ పుట్టినరోజు కాగా ఆ తేదీన బొమ్మరిల్లు రీరిలీజ్ అయితే అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెపవచ్చు.

ఈ సినిమాలోని పాటలు సైతం అప్పట్లో అంచనాలను మించి హిట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ప్రతి పాట ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. బొమ్మరిల్లు రీరిలీజ్ వార్తలు ఈ సినిమా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దిల్ రాజు తన బ్యానర్ లో హిట్టైన సినిమాలను రీరిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (Bommarillu) బొమ్మరిల్లు మూవీ రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తే రాబోయే రోజుల్లో మరిన్ని సిద్దార్థ్ సినిమాల రీరిలీజ్ దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంది. సిద్దార్థ్ తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus