పాన్ ఇండియా… మొన్నటి వరకు సౌత్ ప్రేక్షకులకు ఇదో బ్రహ్మా పదార్థం. ఇలాంటి సినిమాలు తీయాలంటే ఏ కొందరికో సాధ్యం అనుకునేవారు. కానీ ‘పుష్ప’, ‘కేజీయఫ్ 2’, ‘ఆర్‌ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’తో పాన్ ఇండియా ఒక సాధారణ సినిమా అయిపోయింది. పాన్ ఇండియా అనే పదం అనగానే సౌత్ సినిమా అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితమే జరిగింది అని అంటున్నారు ప్రముఖ నటుడు సిద్ధార్థ్. ఇటీవల ఆయన పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడారు.
పాన్ ఇండియా సినిమా నేపథ్యంలో దక్షిణాది, ఉత్తరాది హీరోల మధ్య చిన్నపాటి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ చర్చ జరిగే క్రమంలో భాషలు, జాతీయ భాషల ప్రస్తావన వచ్చి ఇబ్బందిగా మారింది. తాజాగా ఇదే అంశంపై సిద్దార్థ్ స్పందిస్తూ తనదైన శైలి కామెంట్స్ చేశాడు. ‘‘పాన్ ఇండియా అనే పదమే అగౌరవకరం. నా దృష్టిలో నిజానికి అదో నాన్సెన్స్. చేస్తున్న సినిమాలన్నీ భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారు?’’ అంటూ ప్రశ్నించాడు సిద్ధార్థ్.
అంతేకాదు పాన్ ఇండియా సినిమా స్థాయిలో గతంలోనే అంటే 15 ఏళ్ల క్రితమే ఓ సినిమా వచ్చింది అని గుర్తు చేశాడు సిద్ధార్థ్. ‘‘15 ఏళ్ల క్రితమే ‘రోజా’ అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఆ సినిమాను దేశంలో ప్రతి ఒక్కరూ చూశారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. నచ్చిన భాషలో సినిమా చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. అందుకే పాన్ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్ సినిమా అని పెట్టాలి అని అన్నాడు. దీంతో సిద్ధార్థ్ మాటలు వైరల్‌గా మారాయి.
పాన్ ఇండియా సినిమా అనగానే ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాలను గతంలో కొంతమంది ప్రస్తావించేవారు. ఆ తర్వాత వాటి గురించి పక్కనపెట్టేశారు. ‘బాహుబలి’ నుండి మళ్లీ పాన్ ఇండియా ఫీవర్ మొదలైంది. ఆ తర్వాత వరుస సినిమాలొస్తున్నాయి. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలో బోల్తా పడుతుండటంతో దక్షిణాదే గొప్ప అనే చర్చ మొదలైంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!