DJ Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ లో అనుపమ.. లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్లు ఓ రేంజ్లో..!

2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ సూపర్ కలెక్షన్స్ ను సాధించింది. ఈ చిత్రంతో సిద్దు జొన్నలగడ్డ క్రేజీ హీరోగా మారిపోయాడు. హీరోయిన్ నేహా శెట్టికి కూడా చాలా మంచి పేరొచ్చింది. ఈ చిత్రంతో ఆమెకు కూడా మంచి సక్సెస్ లభించినట్టు అయ్యింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ షోకి, లిప్ లాక్ సన్నివేశాలకు, ఇంటిమేట్ సన్నివేశాలకి ఎంత మాత్రం తగ్గలేదు.

అందుకే ‘డిజె టిల్లు’ (DJ Tillu) తర్వాత నేహా శెట్టి బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆమెకు ఇప్పుడు బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా. ‘డిజె టిల్లు’ కి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించడం లేదు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికైంది. ‘అద్భుతం’ వంటి చిత్రాన్ని అందించిన మల్లిక్ రామ్ దర్శకుడు.

అయితే ‘టిల్లు స్క్వేర్’ లో కూడా రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ లు గట్టిగానే ఉంటాయని ఇన్సైడ్ టాక్. కానీ అనుపమ కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వస్తోంది. ‘రౌడీ బాయ్స్’ లో లిప్ లాక్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినా.. ఆమె ఎక్కడా కూడా హద్దులు దాటలేదు. మరి ‘టిల్లు స్క్వేర్’ లో ఈమె ఏ రేంజ్ బోల్డ్ నటన కనబరిచింది అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 15 న ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కాబోతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus