సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘తెలుసు కదా’. ఇప్పటివరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా తన టాలెంట్ చూపించిన నీరజ కోన దర్శకురాలిగా మారి చేస్తున్న సినిమా ఇది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఈ లిరికల్ సాంగ్ 4 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘రోజులు గడిచినా మాయని హాయే నీ వల్లే మొదలాయె… తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే’ అంటూ మొదలైంది. ఆ తర్వాత ‘ఆకాశం అందిందా.. నేలంతా నవ్విందా ఉన్నంట్లుందేదో మారిందా’ అంటూ సిద్ శ్రీరామ్ తన గాత్రంతో సాంగ్ కి హై తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘మల్లిక గంధ’ అంటూ వచ్చే లిరిక్స్ ఆకట్టుకుంటాయి.
వెంటనే హమ్ చేసుకునే విధంగా ఉంటాయి. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ కూడా తన శైలిలో బాగానే ఉంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ రాశీ ఖన్నా..ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది స్పష్టమవుతుంది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు విజువల్స్ చెబుతున్నాయి. మొత్తానికి ‘మల్లిక గంధ’ సాంగ్ వినడానికి బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :